పొత్తూరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి


సీనియర్‌ పాత్రికేయుడు, ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వర్‌ రావుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విజయనగర్‌ కాలనీలో ఉండే పొత్తూరి వెంకటేశ్వర్‌ రావు ఇంటికి వెళ్లి ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించారు. దాదాపు రెండు గంటల పాటు పొత్తూరి ఇంట్లో సిఎం గడిపారు. 1969 నాటి ఉద్యమం నుండి 2014 వరకు అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా నిలిచిన పొత్తూరిని గుర్తు పెట్టుకుని గౌరవించడం తమ బాధ్యత అని ముఖ్యమంత్రి ఈ సందర్బంగా అన్నారు.
సాహిత్య, ఆధ్యాత్మిక, రాజకీయ, అభివృద్ధి, సమకాలీన అంశాలపై మాట్లాడుకున్నారు. పొత్తూరి కుటంబ సభ్యులందరిని పరిచయం చేసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా రచనలో పొత్తూరి లాంటి సీనియర్‌ సిటిజన్ల సలహాలు, సూచనలు తీసుకుంటామని ప్రకటించారు.
సిఎం వెంట డిప్యూటి సిఎం మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, మాజీ చైర్మన్లు కె. శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌, పలువురు జర్నలిస్టు నాయకులు ఉన్నారు.​

No comments

Powered by Blogger.